Sabitha : నన్ను పార్టీలోకి రేవంత్ రమ్మన్నారు.. దానికి సీఎం సమాధానం ఏంటంటే?
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనను కాంగ్రెస్ లోకి రావాలని ఆహ్వానించారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనను కాంగ్రెస్ పార్టీలోకి రావాలని ఆహ్వానించారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు. తాను కాంగ్రెస్ లోకి వస్తే సరైన గౌరవం లభిస్తుందని ఆయన తనతో అన్నారన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏ పార్టీ నుంచి వచ్చారని సబిత ప్రశ్నించారు. కేసీఆర్ ఇంటి మీద వాలిన కాకి తన ఇంటి మీద వాలితే కాల్చి పాడేస్తానని రేవంత్ రెడ్డి అన్న విషయాన్ని సబిత అసెంబ్లీ సమావేశాల్లో గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వస్తే తానే ఆహ్వానించానని అన్నారు. తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేశారన్నారు. ఆడబిడ్డనని చూడకుండా తనను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తున్నారని సబిత అన్నారు. రేవంత్ రెడ్డి ఏ పార్టీ నుంచి ఏ పార్టీలోకి వచ్చారన్నారు.
ఆహ్వానించానని...
తాను సబితను పార్టీలోకి ఆహ్వానించిన మాట వాస్తవమేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. సబితను తన సొంత అక్కగానే భావించానని అన్నారు. తాను 2018లో కొడంగల్ లో ఓడిపోయినప్పుడు పార్టీ తనను మల్కాజ్్గిరి లో పోటీ చేయమన్నప్పుడు తాను సబితక్క ఇంటికి వెళ్లానని అన్నారు. అయితే తాను సబితక్కను కుటుంబ సంబంధాలు, రాజకీయ కారణాల వల్లనే పార్టీలోకి ఆహ్వానించానని తెలిపారు. ప్రజా జీవితంలో వ్యక్తిగతంగా జరిగిన సంభాషణలను సభలో బయట పెట్టడం ఎంత వరకూ సబబని రేవంత్ ప్రశ్నించారు. మంత్రి పదవి కోసం పార్టీని వదిలి బీఆర్ఎస్ లో చేరింది సబిత కాదా? అంటూ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.