కేసీఆర్ వ్యాఖ్యలపై కేంద్రం రెస్పాన్స్ ఇదే
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యలను కేంద్ర ప్రభుత్వం ఖండించింది.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యలను కేంద్ర ప్రభుత్వం ఖండించింది. వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించాలని తాము వత్తిడి చేస్తున్నామని చెప్పడం తప్పుడు ప్రచారం చేయడమేనని చెప్పింది. మీటర్లు బిగించమని రాష్ట్ర ప్రభుత్వాలపై ఎలాంటి వత్తిడి చేయడం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. కేసీఆర్ అబద్దాలను ప్రచారం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారన్నారు. తాము పునరుత్పాదక విద్యుత్తును తాము కొనుగోలు చేయమని చెప్పడం లేదని పేర్కొంది.
ఎవరికైనా ఆ హక్కు....
హైడ్రో పవర్ ప్రాజెక్టుల గురించి కేసీఆర్ మాట్లాడుతున్నారన్నారు. ఫలనా వారి వద్ద నుంచే విద్యుత్తును కొనాలని తాము వత్తిడి చేయడం లేదని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఎవరినుంచైనా విద్యుత్తు ను కొనుగోలు చేసే హక్కు రాష్ట్రాలకు ఉంటుందని కేంద్రం స్పష్టం చేసింది. కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టుల కోసం కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి రాష్ట్రానికి 55 వేల కోట్ల రూపాయల రుణం ఇచ్చిందన్నారు. దీనికి కేసీఆర్ కేంద్రానికి రుణపడి ఉండాలని కేంద్రం తెలిపింది. ముఖ్యమంత్రి పదవిలో ఉండి కూడా కేసీఆర్ అబద్ధాలు చెబుతున్నారని పేర్కొంది.