రుణాల్లో కోత.. కేంద్రం షాక్

తెలంగాణ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. 2022 - 2023 ఆర్థిక సంవత్సరంలో తీసుకునే రుణాలపై కోత విధించింది.

Update: 2022-07-06 07:50 GMT

తెలంగాణ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. 2022 - 2023 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రం తీసుకునే రుణాలపై కోత విధించింది. 52,167 కోట్ల రుణాలను తీసుకోవడానికి కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదనలు పంపితే అందులో 19 వేల కోట్ల రూపాయల మేరకు కోత విధించింది. దీంతో ప్రభుత్వం వచ్చే ఏడాది 33 వేల కోట్ల రూపాయలకు మించి రుణం తీసుకోవడానికి వీలు లేదు. అప్పుల కోసం తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే అనేక దారులను వెతుక్కుంటుంది. స్థలాలను విక్రయిస్తుంది.

నిబంధలను సవరించి...
అయితే తాజాగా కేంద్ర ప్రభుత్వం విధించిన కోతతో తెలంగాణ సర్కార్ ఇబ్బందులు పాలయ్యే అవకాశముంది. కొత్తగా కేంద్ర ప్రభుత్వం నిబంధనలను మార్చింది. అప్పులతో పాటు వివిధ కార్పొరేషన్ల పేరుతో తీసుకున్న రుణాలను కూడా ఎఫ్ఆర్ఎంబీ పరిధిలోకి తెచ్చింది. దీంతో రెండేళ్లలో తీసుకున్న అప్పుల ప్రకారం లెక్కలు వేసి 19 వేల కోట్ల మేరకు కోత విధించింది.


Tags:    

Similar News