Telangana : ప్రధానితో అరగంట భేటీలో మేము కోరింది ఇవే

ప్రధాని నరేంద్ర మోదీతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం ముగిసింది. దాదాపు అరగంట సేపు సమావేశమయ్యారు

Update: 2023-12-26 13:10 GMT

revanth reddy's meeting with prime minister

ప్రధాని నరేంద్ర మోదీతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం ముగిసింది. దాదాపు అరగంట సేపు సమావేశమయ్యారు. రేవంత్ రెడ్డితో పాటు మల్లు భట్టి విక్రమార్క కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. తెలంగాణకు రావాల్సిన నిధులు వెంటనే అందేలా చూడాలని ఈ సందర్భంగా ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లారు. పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని ప్రధాని మోదీని ఇరువురు నేతలు కోరారు. హైదరాబాద్‌కు ఐఐఎంతో పాటు సైనిక్ స్కూలుకు వెళ్లాలని కోరారు. విభజన చట్టంలోని అంశాలను అమలు చేయాలని ఇద్దరూ కోరారు.

వెనకబడిన ప్రాంతాలకు...
వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక నిధులను ఇవ్వాలని కూడా ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లారు. స్టీల్ ప్లాంట్, రైల్వే కోచ్ ఫ్యాక్టరీతో పాటు ఐటీఐఆర్ లను వెంటనే మంజూరు చేయాలని కోరారు. ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయిన తర్వాత ఇరువురు నేతలు మీడియా సమావేశంలో మాట్లాడారు. పదేళ్లు పాలించిన బీఆర్ఎస్ ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తం చేసిందన్నారు. తెలంగాణను కొట్లాడి తెచ్చుకుంది నీళ్లు, నిధులు, నియామకం కోసమేనని మల్లు భట్టి విక్రమార్క అన్నారు. కానీ గత ప్రభుత్వం వాటిని విస్మరించిందన్నారు.
ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా...
విభజన చట్టంలోని అన్ని అంశాలను పరిశీలించి వాటిని అమలు చేయాలని ప్రధానిని కోరినట్లు మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పుల నుంచి బయటపడేందుకు నిధులను విడుదల చేయాలని మోదీని కోరినట్లు తెలిపారు. ఫెడరల్ స్ఫూర్తికి విఘాతం కలగకుండా చూడాలని ప్రధాని కోరామన్నారు. తెలంగాణ ప్రయోజనాలను కాపాడేందుకే తాము ప్రధానిని కలిసినట్లు వారు మీడియా సమావేశంలో వివరించారు. ప్రధాని సానుకూలంగానే స్పందించారని వారు మీడియా సమావేశంలో తెలిపారు.


Tags:    

Similar News