క్రిమినల్ కేసులు ఎక్కువ ఉన్న నాయకుల జాబితాలో సీఎం కేసీఆర్

దేశ వ్యాప్తంగా ఉన్న మొత్తం 4,759 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలపై ఉన్న క్రిమినల్ కేసులపై ఏడీఆర్ (అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్) సంస్థ నివేదికను ఇచ్చింది.

Update: 2022-07-13 12:33 GMT

దేశ వ్యాప్తంగా ఉన్న మొత్తం 4,759 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలపై ఉన్న క్రిమినల్ కేసులపై ఏడీఆర్ (అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్) సంస్థ నివేదికను ఇచ్చింది. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్), నేషనల్ ఎలక్షన్ వాచ్ (ఎన్ఈడబ్ల్యూ) సంస్థలు ఎన్నికైన శాసనసభ, పార్లమెంటు ప్రతినిధుల అఫిడవిట్‌లను విశ్లేషించి, ముఖ్యమంత్రి కేసీఆర్‌ పై 64 కేసులు ఉన్నాయని తెలిపాయి. కేసీఆర్ పై 64 క్రిమినల్ కేసులు నమోదయ్యాయని, వాటిలో 37 తీవ్రమైన IPC సెక్ష‌న్లు కలిగి ఉన్నాయని వెల్ల‌డించారు. కేరళ ఎంపీ డీన్‌ కురియకోస్‌పై 204 కేసులతో మొదటి స్థానంలో ఉన్నారు. 99 పెండింగ్‌ కేసులతో డీఎంకే ఎంపీ ఎస్‌.కతిరవన్‌, ఉత్తరప్రదేశ్‌కు చెందిన సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్యే మహ్మద్‌ ఆజం ఖాన్‌ లపై 87 ఉన్నాయి. తమిళనాడు ఎమ్మెల్యే ప్రిన్స్‌ జేజీ 73 కేసులతో నాలుగో స్థానంలో నిలిచారు. అత్యధిక క్రిమినల్ కేసులున్న టాప్ ఐదుగురు ప్రజాప్రతినిధుల్లో కేరళ ఎంపీ డీన్ కురియకోస్ 204 కేసులతో మొద‌టి స్థానంలో ఉన్నారు. 99 పెండింగ్‌ కేసులతో (తమిళనాడు) డీఎంకే ఎంపీ ఎస్‌.కతిరవన్‌ రెండో స్థానంలో ఉన్నారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్యే మహ్మద్‌ ఆజం ఖాన్‌ 87 కేసుల‌తో మూడో స్థానంలో ఉన్నారు. మరో తమిళనాడు ఎమ్మెల్యే ప్రిన్స్‌ జేజీ 73 కేసులతో నాలుగో స్థానంలో ఉండగా, 64 క్రిమినల్ కేసులతో తెలంగాణ సీఎం కేసీఆర్ ఐదో స్థానంలో నిలిచారు. కేసీఆర్‌పై నమోదైన కేసుల్లో ఎక్కువ భాగం తెలంగాణ పోరాటంలోనే నమోదైనవేనని నివేదిక పేర్కొంది. ఇక మొత్తం లోక్ సభ ఎంపీల్లో 44 శాతం మందిపై క్రిమినల్ కేసులు ఉండగా 31 శాతం మంది రాజ్యసభ ఎంపీలపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని ఎమ్మెల్యేల్లో 43 శాతం మంది క్రిమినల్ కేసులు నమోదైన వారు ఉన్నట్లు ఏడీఆర్ రిపోర్ట్ తెలిపింది.


Tags:    

Similar News