Pawan Kalyan : నేడు కొండగట్టుకు పవన్ కల్యాణ్
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నేడు కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకోనున్నారు.;
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నేడు కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకోనున్నారు. ఉదయం పదకొండు గంటలకు ఆయన జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయస్వామి దేవాలయానికి చేరుకుంటారు. ఆయన కొండగట్టు ఆంజనేయ స్వామిని తమ ఇలవేల్పుగా భావిస్తారు. ఎన్నికలకు ముందు కూడా ఆయన తన వారాహి ప్రచార రధాన్ని తీసుకుని కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయానికి వచ్చి పూజలు జరిపి అక్కడి నుంచే యాత్రను ప్రారంభించారు.
అభిమానులు వస్తారని...
జనసేన అధినేత పవన్ కల్యాణ్ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయానికి వస్తుండటంతో ప్రత్యేక బందోబస్తును ఏర్పాటు చేశారు. ఆయనకు వై కేటగిరీ భద్రతను కల్లపించారు. ఆయన కొండగట్టుకు వస్తున్నారని తెలిసి పెద్ద సంఖ్యలో అభిమానులు వచ్చే అవకాశముండటంతో ఆలయ పరిసర ప్రాంతాల్లో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా పవన్ కల్యాణ్ దర్శనం చేసుకుని వెళ్లనున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఆయనకు స్వాగతం చెప్పేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.