Telangana : కాంగ్రెస్ సీనియర్ నేత డీఎస్ మృతి
తెలంగాణలో కాంగ్రెస్ సీనియర్ నేత ధర్మపురి శ్రీనివాస్ మృతి చెందారు
తెలంగాణలో కాంగ్రెస్ సీనియర్ నేత ధర్మపురి శ్రీనివాస్ మృతి చెందారు. ఈరోజు తెల్లవారుజామున హైదరాబాద్ లోని ఆయన నివాసంలో తుదిశ్వాస విడిచారు. డి.శ్రీనివాస్ గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. అయితే ఈ తెల్లవారుజామున గుండెపోటుతో మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. 1948 సెప్టెంబు27న డీఎస్ జన్మించారు. నిజాం కళాశాలలో డిగ్రీ పూర్తి చేసిన ఆయన 1989లో కాంగ్రెస్ పార్టీలో చరి పోటీ చేసి నిజామాబాద్ అర్బన్ నుంచి పోటీ చేసి తొలిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. తర్వాత 2004, 2009లోనూ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
సుదీర్ఘకాలం కాంగ్రెస్ లోనే...
నిజామాబాద్ కు చెందిన డి. శ్రీనివాస్ సుదీర్ఘకాలం కాంగ్రెస్ లో ఉన్నారు. 2004, 2009 లో కాంగ్రెస్ అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు ఆయన పీసీసీ అధ్యక్షుడిగా పనిచేశారు. మంత్రిగానూ కొనసాగారు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత డి.శ్రీనివాస్ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఎంపికయ్యారు. అయితే తర్వాత బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరారు. అయితే అప్పటికే అనారోగ్యంగా ఉండటంతో ఆయన యాక్టివ్ గా లేరు. ఆయన పెద్దకుమారుడు సంజయ్ గతంలో నిజామాబాద్ మేయర్ గా పనిచేశారు. చిన్నకుమారుడు ధర్మపురి అరవింద్ రెండుసార్లు నిజామాబాద్ ఎంపీగా గెలిచారు. ప్రస్తుతం బీజేపీ ఎంపీగా కొనసాగుతున్నారు.