కాంగ్రెస్ కీలక నిర్ణయం.. బాధ్యతలు వీరికే

కాంగ్రెస్ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారంపై పార్టీ అధినాయకత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

Update: 2022-08-02 05:46 GMT

కాంగ్రెస్ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారంపై పార్టీ అధినాయకత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాజగోపాల్ రెడ్డిని పార్టీ వీడీ వెళ్లకుండా చూసే బాధ్యతను సీనియర్ నేత జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలకు హైకమాండ్ బాధ్యతలను అప్పగించినట్లు తెలిసింది. రెండు రోజుల్లో ఈ విషయాన్ని తేల్చేయాలని పార్టీ అధినాయకత్వం వీరికి సూచించింది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేస్తే మునుగోడు ఇన్‌ఛార్జిగా కోమటిరెడ్డి వెంకటరెడ్డిని నియమించాలని కూడా పార్టీ హైకమాండ్ ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది.

రెండు రోజుల్లో....
నిన్న ముఖ్య నేతలతో సమావేశమైన కాంగ్రెస్ హైకమాండ్ మునుగోడు పరిస్థితిపై రెండు రోజుల్లోగా తేల్చాలని నాయకులకు చెప్పేసింది. సాధ్యమయినంత వరకూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీని వీడకుండా చూడాలని, ఒక వేళ వెళితే ప్రత్యామ్నాయం కూడా ఆలోచించాలని సూచించినట్లు సమాచారం. అంతేకాకుండా త్వరలో మనుగుడులో భారీ బహిరంగ సభను కూడా ఏర్పాటు చేేసే యోచనలో కాంగ్రెస్ అధినాయకత్వం ఉన్నట్లు సమాచారం.


Tags:    

Similar News