తెలంగాణలో మళ్లీ పెరుగుతున్న కేసులు

తెలంగాణలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఒక్కరోజులోనే 114 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు

Update: 2022-09-16 03:00 GMT

తెలంగాణలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఒక్కరోజులోనే 114 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. కరోనా కారణంగా ఎవరూ మరణించలేదు. అయితే నిన్న ఒక్కరోజులోనే 130 మంది కరోనా నుంచి కోలుకున్నారని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. హైదరాబాద్ నగరంలోనే ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. 48 మంది హైదరాబాద్ లో కరోనా వైరస్ బారిన పడ్డారు.

యాక్టివ్ కేసులు...
తెలంగాణలో ఇప్పటి వరకూ 8,36,411 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. వీరిలో 8,31, 588 మంది కరోనా నుంచి కోలుకున్నారని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. ఇప్పటి వరకూ కరోనా కారణంగా 4,111 మంది మరణించారు. ప్రస్తుతం తెలంగాణలో 792 యాక్టివ్ కేసులున్నాయి. రికవరీ రేటు 99.41 శాతంగా నమోదయింది.


Tags:    

Similar News