తెలంగాణలో వెయ్యి లోపే యాక్టివ్ కేసులు

తెలంగాణలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. ఈరోజు 88 మందికి కరోనా పాజిటివ్ సోకింది. కరోనా కారణంగా ఎవరూ మరణించాలేదు

Update: 2022-09-11 13:54 GMT

తెలంగాణలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. ఈరోజు 88 మందికి కరోనా పాజిటివ్ సోకింది. కరోనా కారణంగా ఎవరూ మరణించాలేదు. ఈరోజు కరోనానుంచి 102 మంది కోలుకున్నారని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. కరోనా రికవరీ రేటు 99.40 శాతంగా నమోదయింది. నమోదయిన 88 కేసుల్లో అత్యధికంగా 56 కేసులు హైదరాబాద్ లోనే నమోదయినట్లు అధికారులు తెలిపారు.

భారీగా తగ్గుదల....
తెలంగాణలో ఇప్పటి వరకూ 8,35,941 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. వీరిలో 8,30,956 చికిత్స పొంది కోలుకున్నారని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. తెలంగాణలో కరోనా కారణంగా ఇప్పటి వరకూ 4,111 మంది మరణించారు. ప్రస్తుతం తెలంగాణలో 874 యాక్టివ్ కేసులున్నాయి. వీరంతా హోంఐసొలేషన్ లో ఉండి చికిత్స పొందుతున్నారు. కేసులు తగ్గుతున్నా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.


Tags:    

Similar News