గద్వాల ఎమ్మెల్యేగా డీకే అరుణ

తెలంగాణ హైకోర్టు గద్వాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి ఎన్నిక చెల్లదని స్పష్టం చేసింది

Update: 2023-08-24 10:20 GMT

తెలంగాణ హైకోర్టు గద్వాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి ఎన్నిక చెల్లదని స్పష్టం చేసింది. ఎమ్మెల్యేగా ఆయనను అనర్హుడిగా ప్రకటించింది. ఎన్నికల అఫిడవిట్ లో తప్పుడు సమాచారాన్ని ఇచ్చారనే కారణంగా డిస్ క్వాలిఫై చేసింది. ఎన్నికల ఫలితాలలో రెండో స్థానంలో ఉన్న బీజేపీ నాయకురాలు డీకే అరుణను ఎమ్మెల్యేగా ప్రకటించింది. గత ఎన్నికల్లో డీకే అరుణ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. కృష్ణమోహన్ రెడ్డికి రూ. 3 లక్షల జరిమానా విధించింది. ఈ జరిమానాలో డీకే అరుణకు రూ. 50 వేలు చెల్లించాలని ఆదేశించింది. హైకోర్టు తీర్పును కృష్ణమోహన్ రెడ్డి సుప్రీంకోర్టులో సవాల్ చేయనున్నారు.

గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి తప్పుడు అఫిడవిట్‌ సమర్పించారని ఆయనపై వేటు వేసింది తెలంగాణ హైకోర్టు. ఎమ్మెల్యేగా ఆయన్ని అనర్హుడిగా ప్రకటించింది. ఆయన ఎన్నిక చెల్లదంటూ తీర్పు వెలువరించింది. రెండో స్థానంలో ఉన్న డీకే అరుణను ఎమ్మెల్యేగా ప్రకటించింది.


Tags:    

Similar News