ఈడీ విచారణకు ఏపీ మాజీ ఎమ్మెల్యే

క్యాసినో కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు విచారణలో స్పీడ్ పెంచారు

Update: 2022-11-17 06:57 GMT

క్యాసినో కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు విచారణలో స్పీడ్ పెంచారు. నేపాల్ వెళ్లిన వంద మందికి ఈడీ నోటీసులు జారీ చేసినట్లు తెలిసింది. అనంతపురం మాజీ ఎమ్మెల్యే గుర్నాధరెడ్డి ఈరోజు ఈడీ విచారణకు హాజరయ్యారు. ఆయనను ఈ కేసులో ఈడీ అధికారులు విచారించనుంది. ఏపీలో మరికొందరు నేతలకు కూడా ఈడీ నోటీసులు జారీ చేసే అవకాశాలున్నాయని అధికార వర్గాలు చెబుతున్నాయి.

నేపాల్ వెళ్లిన...
నిన్న మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ సోదరులను విచారించిన ఈడీ ఈరోజు మరికొందరిని విచారిస్తుంది. ఇందులో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎల్ రమణ కూడా ఉన్నారు. వీరితో పాటు మరికొందరిని ఈరోజు, రేపు విచారించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ కేసులో చీకోటి ప్రవీణ్ ను విచారించిన ఈడీ కొన్ని కీలక ఆధారాలు లభ్యం కావడంతో క్యాసినో ఆడేందుకు నేపాల్ కు వెళ్లిన ప్రముఖులను విచారించేందుకు సిద్ధమయింది. మనీలాండరింగ్ కు పాల్పడ్డారన్న కారణంతో విచారణ జరపనుంది.


Tags:    

Similar News