Hydra : ఆక్రమిస్తే కూల్చివేతలు తప్పవు : రంగనాధ్
ప్రభుత్వం భూములను ఆక్రమిస్తే ఊరుకోబోమని హైడ్రా కమిషనర్ రంగనాధ్ తెలిపారు
ప్రభుత్వం భూములను ఆక్రమిస్తే ఊరుకోబోమని హైడ్రా కమిషనర్ రంగనాధ్ తెలిపారు. చెరువులు, నాలాలు, కుంటలు, ప్రభుత్వ స్థలాల ఆక్రమణలను కూల్చడమే హైడ్రా పని అన్నారు. అవి ప్రజల ఆస్తులేనని ఆయన అన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం హైడ్రాను ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. ఈ సంస్థకు చట్టబద్ధత కల్పించిందని చెప్పారు. అనేక చోట్ల ప్రభుత్వ భూములను అన్యాక్రాంతమవుతుందని రంగనాధ్ అన్నారు. స్థానికంగా పలుకుబడి ఉన్నవాళ్లు వ్యవస్థలను మానేజ్ చేసుకుంటూ ఇన్నాళ్లు ఆక్రమణలను చేశారన్నారు.
సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం...
అన్ని శాఖల నుంచి వారికి సహకారం అందిందన్నారు. సోషల్ మీడియాలో హైడ్రాపై తప్పుడు ప్రచారం జరుగుతుందని రంగనాధ్ అన్నారు. ప్రజల ఆస్తులను కాపాడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. అమీన్ పూర్ లో వేలాది ఎకరాల భూములు ఆక్రమణలకు గరయ్యాయని ఆయన చెప్పారు. నోటీసులు ఇచ్చిన తర్వాతనే కూల్చివేస్తున్నామని రంగనాధ్ తెలిపారు. అమీన్ పూర్ లో ఒక భవనాన్ని కూల్చివేసినా మళ్లీ కట్టారని రంగనాధ్ అన్నారు. కూల్చిన భవనంలో ఆసుపత్రి లేకపోయినా ఆసుపత్రి ఉన్నట్లు ప్రచారం చేశారని రంగనాధ్ అన్నారు. హైడ్రాపై తప్పుడు ప్రచారం చేయడం వల్లనే కొందరు భయాందోళనలు చెందుతున్నారని ఆయన అన్నారు. భవిష్యత్ లో కోటి మంది ప్రజలు వరదలతో ఇబ్బందులు పడకుండా ఈ చర్యలు తీసుకుంటున్నామని రంగనాధ్ తెలిపారు.