నమ్మించి నట్టేట ముంచింది : హరీశ్ రావు

కాంగ్రెస్ నమ్మించి రైతులను నట్టేట ముంచిందని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు

Update: 2024-05-21 01:40 GMT

కాంగ్రెస్ నమ్మించి రైతులను నట్టేట ముంచిందని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. రైతులకు తాము పండించిన ధాన్యాన్ని ఐదు వందల రూపాయల బోనస్ ఇచ్చి కొనుగోలు చేస్తామని చెప్పి చివరకు సన్న వడ్లనే కొనుగోలు చేస్తామని చెప్పిందని అన్నారు. కాంగ్రెస్ బోనస్ పెద్ద బోగస్ అంటూ ఆయన మండిపడ్డారు. ఎన్నికల హామీని కాంగ్రెస్ అమలు చేయకుండా ఇలా అడ్డదారిలో వెళుతుందన్నారు. రైతులు తాము పండిన పంటను బోనస్ ఇచ్చి ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని ఎదురు చూస్తుండగా కేవలం సన్న వడ్లనే కొనుగోలుచేస్తామని చెప్పడమేంటని హరీశ్ రావు ప్రశ్నించారు.

నిరుద్యోగులకు...
నిరుద్యోగులకు నెలకు నాలుగువేల రూపాయల నిరుద్యోగ భృతిని ఇస్తామని చెప్పి దానిని కూడా అమలు చేయడం లేదన్నారు. ఎన్నికలకు రాకముందు ఆర్భాటంగా ఇచ్చిన హామీలను అమలు పర్చడంలో ఏ మాత్రం పట్టించుకోవడం లేదన్నారు. మాట మారుస్తూ కొర్రీలు పెడుతూ అర్థం లేని నిర్ణయాలు తీసుకుంటుందని ఆయన ధ్వజమెత్తారు. రైతులను, నిరుద్యోగులను మోసం చేస్తున్న ఈ సర్కార్ కు ప్రజలే తగిన బుద్ధి చెబుతారని ఆయన అభిప్రాయపడ్డారు. రైతులకు రెండు లక్షల రుణమాఫీ కూడా పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు.


Tags:    

Similar News