శివనాగిరెడ్డి అనువాదరచన బుద్ధవంశాన్ని ఆవిష్కరించిన జూపల్లి కృష్ణారావు

బుద్ధవనం కన్సల్టెంట్ శివనాగిరెడ్డి అనువదించిన బుద్ధ వంశ గ్రంధాన్ని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆవిష్కరించారు.

Update: 2024-10-27 13:58 GMT

హైదరాబాద్, నందికొండ, అక్టోబర్ 27 : సికింద్రాబాద్ మహేంద్ర హిల్స్లోని మహాబోధి బుద్ధ విహార నిర్వహించిన కఠిన చీవర దాన వేడుకలలో భాగంగా బుద్ధవనం కన్సల్టెంట్, ప్లీచ్ ఇండియా, సీఈఓ, ఈమని శివనాగిరెడ్డి పాలీ భాష నుంచి తెలుగులోకి అనువదించిన బుద్ధవంశం గ్రంధాన్ని, తెలంగాణ పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆవిష్కరించారని శివనాగిరెడ్డి చెప్పారు.

మహాబోధి బుద్ధ విహార ప్రధాన పోషకుడు, బుద్ధవనం ప్రాజెక్ట్ మెంటార్, చెన్నూరు ఆంజనేయ రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం నాడు జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ సమాజ రుగ్మతలకు బుద్ధుని బోధనలే శరణ్యమని, తద్వారా కలిగే మనోవికాసం వల్ల శాంతియుత, శుభప్రద జీవితాన్ని గడపొచ్చు అన్నారు. మహా బోధి బుద్ధ విహార, బుద్ధవనం ప్రాజెక్ట్ రూపశిల్పి ఆంజనేయ రెడ్డి కృషిని మంత్రి అభినందించారు. ఒకప్పటి బౌద్ధ సంస్కృతి పరిరక్షణలో భాగంగా వర్షా వాసం గడిపిన బౌద్ధభిక్షువులకు చీవరాలు (దుస్తులు) దానం చేసే వేడుకల్లో పాల్గొనడం తన అదృష్టం అన్నారు.

తదనంతరం, బుద్ధవంశం గ్రంధాన్ని అనువదించిన ఈమని శివనాగిరెడ్డిని, అదే గ్రంధానికి వ్యాఖ్యానాన్ని రచించిన తియ్యగూర సీతారామిరెడ్డిని పర్యాటక మంత్రి జూపల్లి కృష్ణారావు సత్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ బౌద్ధ భిక్షువులు పూజ్య ఇట్టిక, పూజ్య ఆనంద, పూజ్య సుగతానంద, పూజ్య బుద్ధదత్త, పూజ్య బుద్ధపాల, పూజ్య సంఘపాల, బౌద్దోపాసకులు సంబటూరి వీరనారాయణరెడ్డి, సుధన్ రెడ్డి, శ్యామసుందర్రావు, తెలంగాణ బిఎస్ఐ అధ్యక్షుడు పరంధాములు పాల్గొన్నారు

Tags:    

Similar News