యాదవ సోదరులకు రేవంత్ గుడ్ న్యూస్

యాదవ సోదరులకు రేవంత్ గుడ్ న్యూస్ చెప్పారు. సదర్ సమ్మేళనం రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందన్నారు

Update: 2024-10-27 12:10 GMT

యాదవ సోదరులకు రేవంత్ గుడ్ న్యూస్ చెప్పారు. హైదరాబాద్ నగర అభివృద్ధిలో యాదవ సోదరుల పాత్ర కాదనలేనిదని రేవంత్ రెడ్డి అన్నారు.నగరంలో సదర్ ఉత్సవాలు నిర్వహించడం రాష్ట్రానికి గర్వకారణమని తెలిపారు. హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో తెలంగాణ సదర్ సమ్మేళనంలో ముఖ్య అతిధిగా హాజరైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ సదర్ సమ్మేళనం రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందని తాను ఆనాడే చెప్పానని అన్నారు. ఇక నుంచి ప్రతీ ఏటా సదర్ సమ్మేళనం అధికారికంగా నిర్వహించాలని, ఈ వేదిక నుంచి అధికారులకు ఆదేశాలు ఇస్తున్నానని రేవంత్ రెడ్డి తెలిపారు. దర్ అంటే యాదవుల ఖదర్ అని, దర్ సమ్మేళనాన్ని ప్రతీ గ్రామానికి తీసుకెళ్లాలన్నారు యాదవులు రాజకీయంగా ఎదగాలని అనిల్ కుమార్ యాదవ్ ను రాజ్యసభకు పంపించామని తెలిపారు. రాబోయే రోజుల్లో రాజకీయాల్లో యాదవ సోదరులకు సముచిత స్థానం కల్పిస్తామని తెలిపారు.

పశుసంపదను పెంచి...
హైదరాబాద్ నగరంలో యాదవ సోదరులు పశు సంపదను పెంచి పోషించారన్నారు. ఆనాడు మూసీ పరివాహక ప్రాంతాల్లో యాదవ సోదరులు పశుగ్రాసాన్ని పెంచుకునేవారని, మురికి కూపంగా మారిన మూసీకి పునరుజ్జీవం కల్పిద్దామని తెలిపారు. ఈ నగరం అభివృద్ధి చేయడానికి యాదవ సోదరులు అండగా నిలబడాలని రేవంత్ రెడ్డి కోరారు. ఏ శక్తులు అడ్డొచ్చినా నగరాన్ని అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేసే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానిది అంటూ ఆయన తెలిపారు. మూసీ పరివాహక ప్రాంతవాసుల జీవన ప్రమాణాలను మెరుగు పరచబోతున్నామని తెలిపారు. యాదవ సోదరులు అవాకాశాలను అందిపుచ్చుకోవాలని, నాడు ముషీరాబాద్ లో అంజన్న అన్నను గెలిపించి ఉంటే.. మీవైపు నుంచి మంత్రిగా నిలబడేవారని తెలిపారు. అంజన్ అన్న ఓడినా యాదవ సోదరులకు ప్రాధాన్యత ఉండాలని అనిల్ కు రాజ్యసభ ఇచ్చామని తెలిపారు.


Tags:    

Similar News