KTR : ప్రభుత్వాన్ని ఎలా నడుపుతారో చూస్తాం... ఇప్పుడుంది అసలు ఆట
సాధ్యం కాని హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టిందని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు
సాధ్యం కాని హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టిందని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రభుత్వాన్ని ఇప్పుడు ఎలా నడుపుతారో చూస్తామని ఆయన అన్నారు. అసెంబ్లీ ఆవరణలో ఆయన మీడియాతో చిట్ చాట్ చేశారు. లెక్కలు వేసుకుని హామీలు ఇచ్చారా? హామీలు ఇచ్చి లెక్కలు వేసుకుంటారా? అంటూ కేసీఆర్ వ్యాఖ్యానించారు. తొలి మంత్రివర్గ సమావేశంలోనే ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ఏం చేసిందని ఆయన ప్రశ్నించారు.
అలివికాని హామీలిచ్చి...
తము ప్రతి ఏడాది పద్దులపై శ్వేతపత్రాన్ని విడుదల చేశామన్న కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని రేపటి గవర్నర్ ప్రసంగంలో కూడా చెబుతారని కేటీఆర్ అన్నారు. ఓ ఎమ్మెల్యే తన నియోజకవర్గంలో 45వేల ఉద్యోగాలు ఇస్తామని చెబుతున్నాడని, ఇవి సాధ్యమేనా అని ఆయన ప్రశ్నించారు. తాము కూడా ప్రభుత్వాన్ని ఎలా నడపగలరో చూస్తామని కేటీఆర్ కామెంట్ చేశారు. ఇప్పుడే అసలాట మొదలయిందన్నారు.