నేడు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం
తెలంగాణ రాష్ట్ర రాష్ట్రం ఆవిర్భవించి ఎనిమిదేళ్లు కావస్తుండటంతో ప్రభుత్వం పెద్ద యెత్తున వేడుకలు జరపాలని నిర్ణయించింది
నేడు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జరగనుంది. తెలంగాణ రాష్ట్ర రాష్ట్రం ఆవిర్భవించి ఎనిమిదేళ్లు కావస్తుండటంతో ప్రభుత్వం పెద్ద యెత్తున వేడుకలు జరపాలని నిర్ణయించింది. ఈ వేడుకల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొననున్నారు. గన్ పార్ వద్ద అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించిన అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. జిల్లా స్థాయిలోనూ వేడుకలను నిర్వహించాలని ఇప్పటికే ఆదేశాలు అందాయి.
జిల్లాల్లో మంత్రులు....
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి ఎనిమిదేళ్లు కావస్తుంది. గత రెండేళ్ల నుంచి కరోనా ప్రభావంతో వేడుకలు నిర్వహించడం లేదు. ఈసారి ఘనంగా జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ, ప్రయివేటు సంస్థలకు సెలవుదినంగా ప్రకటించింది. పబ్లిక్ గార్డెన్స్ లో ఉత్సవాల కోసం అవసరమైన అన్ని ఏర్పాట్లను ప్రభుత్వం చేసింది. ఈ సందర్భంగా క్రీడాకారులు నిఖత్ జరీన్, ఈషాసింగ్ లను ముఖ్యమంత్రి కేసీఆర్ వేదికపై సన్మానించనున్నారు. తెలంగాణ ఎనిమిదేళ్లలో ఎలా అభివృద్ధి చెందిందీ, ఏ యే రంగాల్లో ప్రగతి సాధించిందీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు తెలియజేయనున్నారు. జిల్లాల్లో మంత్రులు, చీఫ్ విప్ లు, జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి వేడుకలను నిర్వహిస్తారు.