munugode by elctions: తులం బంగారం ఇవ్వలేదంటూ ఓటును?
మునుగోడు ఉప ఎన్నికల్లో పోలింగ్ రోజున కొందరు మహిళలు తాము ఓటు వేయడానికి నిరాకరిస్తున్నారు.
మునుగోడు ఉప ఎన్నికల్లో భారీగా పోలింగ్ శాతం నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎక్కువగా మహిళలు పోలింగ్ కేంద్రాలకు వస్తున్నారు. వృద్ధుల నుంచి నడి వయసు వారి వరకూ పోలింగ్ కేంద్రాలకు తరలి వస్తున్నారు. మహిళలు ఎక్కువగా పోలింగ్ కేంద్రాల వద్ద కనిపిస్తున్నారు. 2018 ఎన్నికల్లో 91.31 పోలింగ్ నమోదయింది. ఇప్పుడు కూడా అంతే స్థాయిలో ఓట్లు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.
పార్టీలపై ఆగ్రహం....
మరోవైపు పోలింగ్ రోజున కొందరు మహిళలు తాము ఓటు వేయడానికి నిరాకరిస్తున్నారు. బంగారిగడ్డ లెనిన్ కాలనీలో ఓటు వేసేందుకు మహిళలు అంగీకరించడం లేదు. తమకు తులం బంగారం, నలభై వేలు ఇస్తామని పార్టీలు ఆశపెట్టాయని, అవి ఇవ్వకపోవడంతో వారు పార్టీలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాము ఓటు వేయమని, తమకు బంగారం ఇచ్చేంత వరకూ పోలింగ్ కేంద్రాలకు వచ్చేది లేదని చెబుతుండటం విశేషం.