ఒకే పందిట్లో ఇద్దరికి తాళి

ఒకే పెళ్లిమండపంలో ఇద్దరు యువతులను పెళ్లాడిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగింది.

Update: 2023-03-09 04:19 GMT

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వింతైన సంఘటన జరిగింది. ఒకే పెళ్లిమండపంలో ఇద్దరు యువతులను పెళ్లాడిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగింది. మూడు కుటుంబాల అంగీకారంతోనే ఒకే పందరిలో ఇద్దరిని వివాహం చేసుకున్నారు. సత్తిబాబు స్వప్న, సునీత అనే యువకుడు ప్రేమించాడు. స్పవ్నతో అంతకు ముందు సహజీవనం చేయడంతో ఆమె గర్భవతిగా మారింది. అదే సమయంలో స్వప్నతో కొంత విభేదాలు వచ్చి దూరంగా ఉంటున్నాడు.

ఒకరితో ప్రేమ...
అయితే సునీతను కూడా సత్తిబాబు ప్రేమించాడు. సునీతకు పెళ్లి కుదిరిందని తెలియడంతో స్వప్న తల్లిదండ్రులు సత్తిబాబుపై వత్తిడి తెచ్చారు. పోలీసు కేసు పెడతామని బెదిరించారు. దీంతో తలొగ్గిన సత్తిబాబు పెద్దల సమక్షంలోనే ఇద్దరినీ పెళ్లి చేసుకున్నాడు. శుభలేఖలను కూడా ఇద్దరినీ పెళ్లి చేసుకునట్లు ముద్రించడం విశేషం. ఒకే పందిరిలో ఇద్దరికి తాళి కట్టారు. ఇద్దరిని పెళ్లి చేసుకోవడానికి పెద్దలు అంగీకరించడంతో కథ సుఖాంతమైంది. పెళ్లికి ఇరువురు వధువుల కుటుంబ సభ్యులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. ఇది చూసిన అనేక మంది ముక్కున వేలేేసుకున్నారు.


Tags:    

Similar News