మరో ఐదు రోజులు వర్షాలు.. రెడ్ అలెర్ట్
తెలంగాణలో మళ్లీ వర్షాలు కురుస్తున్నాయి. నిన్న ఉదయం నుంచి ప్రారంభమైన వాన తెలంగాణలో అనేక ప్రాంతాలను ముంచెత్తింది.
తెలంగాణలో మళ్లీ వర్షాలు కురుస్తున్నాయి. నిన్న ఉదయం నుంచి ప్రారంభమైన వాన తెలంగాణలో అనేక ప్రాంతాలను ముంచెత్తింది. ఐదు జిల్లాల్లో ఆరెంజ్, ఎల్లో అలెర్ట్ ను అధికారులు జారీ చేశారు. ఒడిశా నుంచి తెలంగాణ మీదుగా కర్ణాటక వరకూ ఉపరితల ద్రోణి కొనసాగుతుందని, వీటి ప్రభావంతో మరో ఐదు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. గ్రేటర్ హైదరబాద్ తో పాటు, మహబూబాబాద్, జనగామ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశమున్నాయని తెలిపింది.
బయటకు రావద్దంటూ....
ఈ ఐదు జిల్లాల్లో రెడ్ అలెర్ట్ ప్రకటించింది. కొన్ని చోట్ల ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. ఇక్కడ ఎల్లో అలెర్ట్ ను జారీ చేసింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు హెచ్చరించారు. అవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించారు. భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికతో నగర వాసులకు ఈ అలెర్ట్ జారీ చేసింది.