ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్ : 48 గంటలు భారీ వర్షాలు

తెలంగాణలో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది

Update: 2023-03-20 02:42 GMT

తెలంగాణలో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈరోజు, రేపు అక్కడకక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురస్తుందని తెలిపింది. ఈ మేరకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రెండురోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కర్ణాటక నుంచి పశ్చిమ విదర్భ వరకూ మహారాష్ట్ర మీదుగా ద్రోణి కొనసాగుతుందని తెలిపారు.

ద్రోణి ప్రభావంతో...
ఈ ప్రభావంతో అనేక ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. ఆదిలాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, వరంగల్, హన్మకొంద, జనగాం, యాదాద్రి, రంగారెడ్డి, హైదారాబాద్ ల జిల్లాలో ఎల్లో అలర్ట్ జారీ అయింది. ఇక్కడ ఉరుములు మెరుపులతో పాటు ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశముందని తెలిపింది. ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించింది.


Tags:    

Similar News