తెలంగాణలో భారీ వర్షాలు.. ఎల్లో అలెర్ట్

తెలంగాణలో రానున్న రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది

Update: 2022-09-20 06:30 GMT

తెలంగాణలో రానున్న రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. వాయువ్య పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశముంది. కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో రాష్ట్రానికి వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.

కొన్ని ప్రాంతాల్లో....
హైదరాబాద్ లో నిన్న రాత్రి ఒక మోస్తరు వర్షం కురిసింది. నేడు కూడా చిరుజల్లులు పడే అవకాశముంది. సాయత్రం, రాత్రి వేళల్లోనే వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. కామారెడ్డి, యాదాద్రి భువనగిరి, సిద్దిపేట, వరంగల్, హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, కరీంనగర్, ములుగు, జగిత్యాల, మంచిర్యాల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది.


Tags:    

Similar News