బీజేపీ వేటకుక్కలను ఉసిగొల్పుతుంది
రాజకీయ ప్రయోజనాల కోసమే బీజేపీ పనిచేస్తుందని మంత్రి కేటీఆర్ అన్నారు.
రాజకీయ ప్రయోజనాల కోసమే బీజేపీ పనిచేస్తుందని మంత్రి కేటీఆర్ అన్నారు. దేశ ప్రయోజనాలను ఆశించి యశ్వంత్ సిన్హాకు మద్దతు ఇచ్చినట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వాలను కూల్చి వేసేందుకు బీజేపీ వేటకుక్కలను ఉసికొల్పుతుందన్నారు. ఢిల్లీలో యశ్వంత్ సిన్హా నామినేషన్ కార్యక్రమానికి హాజరైన కేసీఆర్ అనంతరం మీడియాతో మాట్లాడారు. ఎనిమిది రాష్ట్రాల్లో ప్రభుత్వాలను బీజేపీ కూల్చి వేసిందని కేటీఆర్ తెలిపారు. మోదీ తెలంగాణకు ఇచ్చింది ఏమీ లేదన్నారు. బీజేపీ వన్నీ ఫాల్త్ మాటలన్నారు. తెలంగాణకు ఇచ్చిన నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలని కోరారు. నియంత పాలనకు నిరసనగా అందరూ గొంతు విప్పాలని కేటీఆర్ పిలుపు నిచ్చారు.
తెలంగాణకు అన్యాయం...
దేశంలో అమలవుతున్నది అంబేద్కర్ రాజ్యాంగం కాదని, మోదీ రాజ్యాంగమని ఆయన విమర్శించారు. తెలంగాణకు హామీ ఇచ్చిన గిరిజన యూనివర్సిటీని ఇప్పటికీ ఇవ్వలేదన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసమే బీజేపీ పనిచేస్తుందన్నారు. గిరిజనుల మీద ప్రేమ ఉంటే ఖమ్మం జిల్లా నుంచి తాము కోల్పోయిన ఏడు గిరిజన మండలాలను తిరిగి వెనక్కు ఇవ్వాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. కేసీఆర్ బొమ్మ పెట్టుకుని బీజేపీ కార్యాలయం వద్ద తప్పుడు ప్రచారం చేస్తుందన్నారు. తాము తలచుకుంటే మోడీ బొమ్మకు చెప్పుల దండ వేయగలమన్నారు. బీజేపీ చిల్లర రాజకీయాలు చేస్తుందన్నారు.