రేవంత్ రెడ్డిని మార్చాల్సిందే
రేవంత్ రెడ్డిని పీసీసీ చీఫ్ గా తప్పించాలని ఎమ్మెల్యే జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. ఆయన సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు లేఖ రాశారు
రేవంత్ రెడ్డిని పీసీసీ చీఫ్ గా తప్పించాలని ఎమ్మెల్యే జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. ఆయన సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు లేఖ రాశారు. పార్టీ లైన్ కంటే వ్యక్తిగత ఇమేజ్ కోసమే రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని జగ్గారెడ్డి తన లేఖలో ఫిర్యాదు చేశారు. తనకు, రేవంత్ రెడ్డికి ఎలాంటి వ్యక్తిగత విభేదాలు ఏమీ లేవని ఆయన చెప్పారు. రేవంత్ రెడ్డిని పీసీసీ చీఫ్ గా మార్చి అందరినీ కలుపుకుని పోయే వేరే వ్యక్తిని నియమించాలని ఆయన తన లేఖలో కోరారు.
సొంత ఇమేజ్ కోసమే....
రేవంత్ రెడ్డి తన ఇమేజ్ కోసమే నిత్యం ప్రయత్నిస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. గ్రామస్థాయికి వెళ్లి పార్టీని బలోపేతం చేసే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేయడం లేదని తెలిపారు. రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో కూడా ఎమ్మెల్సీ అభ్యర్థిని పోటీ చేయించలేదని తెలిపారు. రేవంత్ రెడ్డిని మార్చకుంటే పార్టీ ఎదుగుదల కష్టమని ఆయన అన్నారు. అలా కాకుంటే పార్టీలైన్ లో రేవంత్ రెడ్డి పనిచేసేలా డైరెక్షన్ ఇవ్వాలని జగ్గారెడ్డి తన లేఖలో కోరారు.