ఏప్రిల్ నుంచి తెలంగాణలో కొత్త పింఛన్లు
తెలంగాణలో కొత్త పెన్షన్లను ఈ ఏడాది ఏప్రిల్ నుంచి అందించనున్నారు. ఈ మేరకు మంత్రి కేటీఆర్ తెలియజేశారు
తెలంగాణలో కొత్త పెన్షన్లను ఈ ఏడాది ఏప్రిల్ నుంచి అందించనున్నారు. ఈ మేరకు మంత్రి కేటీఆర్ తెలియజేశారు. ఇప్పుడు అందుతున్న పింఛనుదారులకు అదనంగా మరో పదకొండు లక్షల మందికి పింఛన్లు అందనున్నాయి. పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను పరిశీలించి ఏప్రిల్ నుంచి కొత్త పింఛన్లు అందచేయాలని కేటీఆర్ అధికారులను ఆదేశించారు.
అదనపు భారమే అయినా...?
ప్రస్తుతం ప్రభుత్వం పింఛను రూపంలో నెలకు రెండు వందల నుంచి రెండు వేల వరకూ వివిధ కేటగిరిలలో అందిస్తున్నారు. పింఛన్ల కోసం ఏడాదికి పది వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంది. దీనికి అదనంగా 800 కోట్ల రూపాయల భారం ప్రభుత్వంపై పడనుంది. తెలంగాణలో కొత్త పింఛనుదారులు చేరితే నలభై లక్షల మందికి చేరే అవకాశముంది.