తెలంగాణలో నేటి నుంచి కొత్త పెన్షన్లు

తెలంగాణలో కొత్త పింఛన్లను నేటి నుంచి జారీ చేయనున్నారు. కొత్తగా పది లక్షల మందికి పింఛన్లను మంజూరు చేశారు

Update: 2022-08-15 03:43 GMT

తెలంగాణలో కొత్త పింఛన్లను నేటి నుంచి జారీ చేయనున్నారు. కొత్తగా పది లక్షల మందికి పింఛన్లను మంజూరు చేశారు. ఈ మేరకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆజాదీకా అమృత్ మహోత్సవ్ లో భాగంగా కొత్తగా పది లక్షల మందికి పెన్షన్లు జారీ చేస్తున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ప్రకటించారు. కొత్తగా మంజూరు చేసిన పింఛన్లను ఈ రోజు నుంచి పంపిణీ చేయనున్నారు.

కొత్త కార్డులు కూడా...
పింఛన్లతో పాటు ఆసరా కార్డులను కూడా పంపిణీ చేయనున్నామని అధికారులు తెలిపారు. పింఛన్లను 65 సంవత్సరాల నుంచి 57 సంవత్సరాలకు కుదించారు. 57 ఏళ్లు నిండిన వారందరికీ నేటి నుంచి పింఛన్లు మంజూరవుతాయి. ప్రస్తుతం 35.95 లక్షల మందికి ఆసరా పింఛన్లు అందుతున్నాయి. నేటి నుంచి వీటికి అదనంగా మరో పది లక్షల పింఛన్లు ప్రభుత్వం మంజూరు చేసింది. ఒక్కొక్కరికి నెలకు 2,116 రూపాయలను ఆసరా కింద పింఛను ను పంపిణీ చేస్తుంది.


Tags:    

Similar News