తెలంగాణాలో యాక్టివ్ కేసులు ఎన్నంటే?
ప్రస్తుతం తెలంగాణలో 751 కరోనా యాక్టివ్ కేసులున్నాయని అధికారులు వెల్లడించారు
తెలంగాణాలో కరోనా కేసులు బాగా తగ్గాయి. ఒక్కరోజులోనే 71 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. ఎలాంటి మరణాలు సంభవించలేదు. ఒక్కరోజులోనే తెలంగాణలో 89 మంది కోలుకున్నారని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. కరోనా రికవరీ రేటు 99.42 శాతంగా నమోదయింది. నమోదయిన 71 కరోనా కేసుల్లో 47 హైదరాబాద్ నగరంలో నమోదయినవేనని అధికారులు తెలిపారు.
మరణాలు లేకున్నా..
ఇక తెలంగాణలో ఇప్పటి వరకూ 8,36,692 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. వీరిలో 8,31,836 మంది కోలుకున్నారని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. ఇప్పటి వరకూ తెలంగాణలో కరోనా కారణంగా 4,111 మంది మరణించారు. ప్రస్తుతం తెలంగాణలో 751 యాక్టివ్ కేసులున్నాయని అధికారులు వెల్లడించారు. అయినా కరోనా జాగ్రత్తలు తీసుకోకపోతే ముప్పు తప్పదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.