ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన ఖరారు.. షెడ్యూల్ ఇదే!!
భారత ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన ఖరారైంది. మార్చి 4, 5 తేదీల్లో తెలంగాణలో
భారత ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన ఖరారైంది. మార్చి 4, 5 తేదీల్లో తెలంగాణలో పలు కార్యక్రమాల్లో ప్రధాని మోదీ పాల్గొననున్నారు. పలు కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులకు ప్రారంభం, మరికొన్ని అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. బహిరంగసభలలో కూడా ఆయన పాల్గొననున్నారు. 4న మహారాష్ట్రలోని నాగ్‌పుర్ నుంచి బయల్దేరి ఉదయం 10.30 గంటలకు ఆదిలాబాద్‌కు రానున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని ప్రసంగిస్తారు. 5న సంగారెడ్డిలో పలు అభివృద్ధి పనులను ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. సంగారెడ్డి బహిరంగ సభలో ఆయన ప్రసంగించనున్నారు.
మార్చి 4న ఉదయం మహారాష్ట్ర నాగ్‌పూర్ ఎయిర్‌పోర్టులో ఎంఐ–17 హెలికాప్టర్‌లో బయలుదేరి ఉ దయం 10.20కు ఆదిలాబాద్‌కు చేరుకుంటారు. 10.30 నుంచి 11 గంటలదాకా ఆదిలాబాద్‌లో వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు, అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తారు. 11.15 నుంచి మధ్యాహ్నం 12 గంటల దాకా బహిరంగసభలో పాల్గొంటారు. 12.15కు ఆదిలాబాద్ నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి మధ్యాహ్నం 1.10 గంటలకు మహారాష్ట్రలోని నాందేడ్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరి మధ్యా హ్నం 2.45 గంటలకు చెన్నైకి చేరుకుంటారు. అక్కడ వివిధ కార్యక్రమాల్లో పాల్గొని చెన్నై ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరి రాత్రి 7.45 గంటలకు హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. రాత్రి 8 గంటలకు రాజ్‌భవన్‌కు చేరుకుని అక్కడే బసచేస్తారు.
మార్చి 5న ఉదయం 10,15 గంటలకు హెలికాప్టర్‌లో బేగంపేట నుంచి బయలుదేరి 10.40 గంటలకు సంగారెడ్డికి చేరుకుంటారు. 10.45 నుంచి 11.15 గంటల దాకా వివిధ అభివృద్ధి ప్రాజెక్ట్‌లు, పనులకు శంకుస్థాపనలు/ ప్రారంభోత్సవాలు చేస్తారు. 11.25 గంటలకు సంగారెడ్డికి చేరుకుంటారు. 12.15 వరకు సభలో ప్రసంగిస్తారు. 12.30కు హెలికాప్టర్‌లో సంగారెడ్డి నుంచి బయ లుదేరి 12.55కు బేగంపేటకు చేరుకుంటారు. మధ్యాహ్నం ఒంటిగంటకు బేగంపేట నుంచి విమానంలో భువనేశ్వర్‌కు పయనమవుతారు.