వైఎస్ షర్మిల అరెస్ట్
వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిలను పోలీసులు అరెస్ట్ చేశారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు
వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిలను పోలీసులు అరెస్ట్ చేశారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పోలీసులపై చేయి చేసుకున్నారన్న కారణంతో షర్మిలపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఆమెను బయటకు వెళ్లనివ్వకుండా అడ్డుకుంటున్నారని ఆగ్రహంతో వైఎస్ షర్మిల ఎస్‌ఐ, కానిస్టేబుల్ పై చేయి చేసుకున్న కేసులో అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. దీంతో లోటస్ పాండ్ వద్ద కొంత ఉద్రిక్తత నెలకొనడంతో షర్మిలను జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. తన రక్షణ కోసం డిఫెన్స్ చేసుకుంటే తప్పా? అని షర్మిల ప్రశ్నిస్తున్నారు.
కంటతడి పెట్టుకున్న వైఎస్ విజయమ్మ....
జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్‌కు వెళ్లిన వైఎస్ విజయమ్మను పోలీసులు అడ్డుకున్నారు. స్టేషన్‌లోకి ఆమెను అనుమతించలేదు. దీంతో విజయమ్మ పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక ముఖ్యమంత్రి భార్యను కూడా పోలీస్ స్టేషన్‌కు వెళ్లకుండా అడ్డుకుంటారా? అని ప్రశ్నించారు. తనను షర్మిలను కలవనివ్వకపోవడంపై కంటతడి పెట్టుకున్నారు.