బీర్లు తాగడంలో రికార్డులు బ్రేక్ చేస్తున్న తెలంగాణ

కరోనా మహమ్మారి ఎక్కడ ప్రబలుతుందో అనే భయంతో చాలా మంది వేడి నీటినే తాగుతూ బ్రతికారు. ఆ తర్వాత కూడా దీన్నే..

Update: 2022-05-17 06:03 GMT

కరోనా సమయంలో చల్లని నీరు తాగాలంటేనే భయపడిపోయిన జనాలు చాలా మందే ఉన్నారు. ఎందుకంటే.. కరోనా మహమ్మారి ఎక్కడ ప్రబలుతుందో అనే భయంతో చాలా మంది వేడి నీటినే తాగుతూ బ్రతికారు. ఆ తర్వాత కూడా దీన్నే అలవాటుగా చేసుకున్నారు. ఇక కరోనా వేవ్స్ సమయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ వచ్చారు. వ్యాక్సిన్స్, బూస్టర్ డోసులు వేసుకోవడం వలన ప్రజల్లో కరోనా మహమ్మారి భయం పోయింది. అందుకే ఈ వేసవిలో చల్లటి బీర్లు తాగాలని పలువురు భావించారు. తెలంగాణలో కూడా బీర్లకు చాలా డిమాండ్ ఏర్పడింది. రికార్డు సంఖ్యలో తెలంగాణ ప్రజానీకం బీర్లు తాగడంతో వైన్ షాప్ ఓనర్లు కూడా ఫుల్ ఖుషీ అవుతున్నారు. కరోనా మహమ్మారి ప్రభావం తగ్గిన తర్వాత బీర్ల అమ్మకాలు భారీగా పెరిగిపోయాయి.. ఇక ఎండను తాళలేక చాలా మంది బీర్ల వైపే మొగ్గు చూపారు.

తెలంగాణ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ప్రకారం.. 2019 కు ముందు ఎలాగైతే బీర్ల అమ్మకాలు ఉండేవో ఆ స్థాయికి ప్రస్తుతం బీర్ల అమ్మకాలు చేరుకున్నాయని తెలిపింది. 2019 లో నెలలో 50 లక్షల కేసుల బీర్ల అమ్మకాలు జరుగుతూ ఉండగా.. 2022 ఏప్రిల్, మే నెలల్లో ఆ స్థాయికి చేరుకున్నాయి అమ్మకాలు. ఏప్రిల్ 2022 లో 50 లక్షల కేసుల బీర్ల అమ్మకాలు జరిగాయి. మే నెలలో 60 లక్షల కేసుల బీర్ల అమ్మకాలు సులువుగా జరగనున్నాయని అంచనా వేస్తోంది అబ్కారీ శాఖ. ఏప్రిల్ 1 నుండి మే 16 మధ్యన 77.88 లక్షల బీర్ కేసుల అమ్మకాలు సాగాయి. 2021 లో ఏప్రిల్ 1 నుండి మే 16 మధ్య 36.41 కేసుల బీర్ల అమ్మకాలు మాత్రమే జరిగాయి.
ఏప్రిల్ 1, 2020 నుండి మే 16, 2020 మధ్య కాలంలో 78 లక్షల బీర్ కేసులు అమ్ముడయ్యాయి. ఏప్రిల్ 1, 2019 నుండి మే 16, 2019 వరకు మొత్తం 81.80 లక్షల బీర్‌లు అమ్ముడయ్యాయి. కాబట్టి మునుపటి స్థాయిలో బీర్ల అమ్మకాలు మొదలైనాయని చెబుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో నీటి లభ్యత లేకపోవడంతో బీరు కొరత ఉంది. గతానికి భిన్నంగా డిపోల నుంచి వైన్ షాపులకు బీరు సరఫరాపై కోటా ఉందని తెలంగాణ వైన్ షాప్ డీలర్స్ అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. తెలంగాణ రాష్ట్రానికి బీరుతో కలిపి నెలకు మొత్తం మద్యం విక్రయాలు రూ.2000 నుంచి రూ.2500 కోట్లు ఉన్నాయి. బీర్లతో పాటు బ్రాందీ, విస్కీ అమ్మకాలు కూడా పెరిగాయని అబ్కారీ శాఖ తెలిపింది.


Tags:    

Similar News