టీఎస్‌పీఎస్సీ ఎదుట పోస్టర్లు

టీఎస్‌పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ పై పోస్టర్లు వెలిశాయి. టీఎస్‌పీఎస్సీ కార్యాలయం వద్ద వెలిసిన పోస్టర్లు కలకలం రేపాయి.

Update: 2023-03-22 06:09 GMT

తెలంగాణలో ఎన్నికలకు ఇంకా నెలలు మాత్రమే సమయం ఉండటంతో రాజకీయ పార్టీల మధ్య కొత్తరకం వార్ మొదలయింది. పోస్టర్లతో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఒక వైపు యుద్ధం కొనసాగిస్తూనే ప్రజలను ఆకట్టుకునేందుకు పోస్టర్లను ఎంచుకున్నారు. రాత్రికి రాత్రి హైదరాబాద్ నగరంలో పోస్టర్లు వెలియడం సర్వసాధారణంగా మారింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ విచారణకు పిలిపించినప్పుడు ఆ పార్టీ నేతలు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టర్లు వేశారు.

ఓయూ జేఏసీ...
అలాగే కల్వకుంట్ల కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్ పై ఆరోపణలు ఎదుర్కొంటున్నప్పుడు కూడా ఆమెకు వ్యతిరేకంగా పోస్టర్లు వెలిశాయి. ఇలా అధికార, విపక్షాల మధ్య పోస్టర్ల వార్ జరుగుతుంది. ఇక తాజాగా టీఎస్‌పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ పై కూడా పోస్టర్లు వెలిశాయి. టీఎస్‌పీఎస్సీ కార్యాలయం వద్ద వెలిసిన పోస్టర్లు కలకలం రేపాయి. ఓయూ జేఏసీ పేరుతో వెలసిన ఈ పోస్టర్లలో టీఎస్‌పీఎస్సీ ఓ జిరాక్స్ సెంటర్ అంటూ ముద్రించారు. పోలీసులు వెంటనే వీటిని తొలగించారు.


Tags:    

Similar News