మరో నాలుగు రోజులు వర్షాలే....ఐఎండీ సూచన

తెలంగాణలో వర్షాలు దంచికొడుతున్నాయి. వడగళ్ల వానలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు

Update: 2022-01-11 03:53 GMT

తెలంగాణలో వర్షాలు దంచికొడుతున్నాయి. వడగళ్ల వానలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తుననాయి. జయశంకర్ భూపాలపల్లి, జనగామ జిల్లాల్లో భారీ వర్షాలు నమోదవుతున్నాయి. ఇక్కడ వడగళ్ల వాన కురిసింది. ఈ నెల 14వ తేదీ వరకూ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింవది. మరో నాలుగు రోజులు వర్షాలు ఉంటాయని చెప్పింది.

వివిధ రాష్ట్రాల్లో....
అరేబియా, బంగాళా ఖాతం నుంచి వీచే గాలుల కారణంగా పలు రాష్ట్రాల్లో ఒక మోస్తరు పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. బీహార్, ఛత్తీస్ ఘడ్, విదర్భ, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్,. సిక్కిం, ఒడిశా, హర్యానా, తెలంగాణలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రేపు తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశముందని చెప్పింది.


Tags:    

Similar News