Revanth Reddy : వారికి రేవంత్ రెడ్డి సర్కార్ గుడ్ న్యూస్

2008 డీఎస్సీ అభ్యర్థులకు రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ తెలిపింది. ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది

Update: 2024-11-07 01:48 GMT

Telangana 2008 DSC candidates 

2008 డీఎస్సీ అభ్యర్థులకు రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ తెలిపింది. 2008 డీఎస్సీ అభ్యర్థుల ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. వీరికి సర్టిఫికేషన్ వెరిఫికేషన్ ఈ నెల 8వ తేదీ లోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించింది. ఇందుకోసం జిల్లాలకు పరిశీలకులను నియమించింది. 2008 డీఎస్సీ అభ్యర్థులను కాంట్రాక్టు పద్ధతిలో తీసుకోవాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే.

సర్టిఫికేట్ వెరిఫికేషన్...
ఈ నేపథ్యంలోనే జిల్లా కేంద్రాల్లో వారికి సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 8వ తేదీలోపు సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తి చేయాలని ఆదేశించడంతో వారికి కాంట్రాక్టు ఉద్యోగాలు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమయింది. దీనివల్ల దాదాపు పన్నెండు వందల మంది అభ్యర్థులు ప్రయోజనం పొందే అవకాశముందని భావిస్తున్నారు. దాదాపు ఒకటిన్నర దశాబ్దంగా ఎదురు చూస్తున్న వారికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీపి కబురు అందించింది.

Tags:    

Similar News