మళ్లీ తెలంగాణలో పెరుగుతున్న కేసులు

ఇప్పటి వరకూ తెలంగాణలో 8,36,797 మంది కరోనా బారిన పడ్డారు. వీరిలో చికిత్స పొంది 8,31,941 మంది కరోనా నుంచి కోలుకున్నారు

Update: 2022-09-20 03:34 GMT

తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతున్నాయి. ఒక్కరోజులో 105 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. కరోనా కారణంగా ఎవరూ మరణించలేదు. నిన్న ఒక్కరోజులో 111 మంది కరోనా చికిత్స పొంది కోలుకున్నారని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. హైదరాబాద్ లో అత్యధికంగా 45 కేసులు నమోదయ్యాయి.

యాక్టివ్ కేసులు....
ఇప్పటి వరకూ తెలంగాణలో 8,36,797 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. వీరిలో చికిత్స పొంది 8,31,941 మంది కరోనా నుంచి కోలుకున్నారని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. ఇప్పటి వరకూ తెలంగాణలో కరనా కారణంగా 4,111 మంది మరణించారు. ప్రస్తుతం తెలంగాణలో 745 యాక్టివ్ కేసులున్నాయి. పాజిటివిటీ రేటు 99.42 శాతంగా నమోదయింది.


Tags:    

Similar News