హోంఐసొలేషన్ లోనే.. మరణాలు లేవు కానీ?

ఇప్పటి వరకూ తెలంగాణలో 8,37,499 కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య నమోదయ్యాయి. వీరిలో 8,32,686 మంది చికిత్స పొంది కోలుకున్నారు

Update: 2022-09-27 02:51 GMT

తెలంగాణలో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఒక్కరోజులోనే 92 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కానీ ఎటువంటి మరణాలు సంభవించలేదు. అత్యధికంగా హైదరాబాద్ నగరంలోనే ఎక్కువ కేసులు నమోదవుతున్నాయని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. ఒక్కరోజులోనే 105 మంది చికిత్స పొంది కరోనా నుంచి కోలుకున్నారు.

రికవరీ రేటు...
ఇప్పటి వరకూ తెలంగాణలో 8,37,499 కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య నమోదయ్యాయి. వీరిలో 8,32,686 మంది చికిత్స పొంది కోలుకున్నారని అధికారులు వెల్లడించారు. ఇప్పటి వరకూ తెలంగాణలో 4,111 మంది మరణించారని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం తెలంగాణలో 702 యాక్టివ్ కేసులున్నాయి. ప్రస్తుతం రికవరీ రేటు 99.43 శాతంగా నమోదయింది. కరోనా సోకిన వారు 95 శాతం మంది హోం ఐసొలేషన్ లోనే చికిత్స పొందుతున్నారని అధికారులు తెలిపారు.


Tags:    

Similar News