30న భద్రాచలంలో సీతారామ కల్యాణం
భద్రాచలంలో ఈ నెల 22 నుంచి ఏప్రిల్ 5 వరకూ శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి
భద్రాచలంలో ఈ నెల 22 నుంచి ఏప్రిల్ 5 వరకూ శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ మేరకు ఆలయ కమిటీ ప్రకటించింది. మార్చి 30 వ తేదీన మిథిలా మండపంలో కల్యాణాన్ని నిర్వహిస్తారు. భక్తులు ప్రత్యక్షంగా సీతారామ కల్యాణాన్ని వీక్షించేందుకు ఆలయ కమిటీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన టిక్కెట్లు నేటి నుంచి అందుబాటులో ఉండనున్నాయి.
టిక్కెట్ ధరలు ఇవీ...
సీతారామ కల్యాణానికి రూ7500, రూ.2,500లు, రెండు వేలు, వెయ్యి మూడు వందలు, రూ.150లు గా టిక్కెట్ ధరలను నిర్ణయించారు. 7,500 రూపాయల టిక్కెట్ పైనే ఇద్దరికి ప్రవేశం ఉంటుంది. స్వామి వారి ప్రసాదం అందచేస్తారు. మిగిలిన టిక్కెట్లపై ఒక్కరినే అనుమతిస్తారు. పదిహేను వేలమంది స్టేడియంలో ఉచితంగా సీతారామ కల్యాణాన్ని చూసేందుకు వీలు కల్పించారు. ఈ నెల 31న జరిగే పట్టాభిషేకానికి కూడా టిక్కెట్లను విక్రయించనున్నారు. నేటి నుంచి అన్ని టిక్కెట్లు ఆన్ లైన్ లో అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు.