నేను సీఎంను.. ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నేతలు రకరకాల వ్యాఖ్యలు చేసేస్తున్నారు. పార్టీలలో సీఎం రేసులో చాలా మంది ఉన్నారు. ..
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నేతలు రకరకాల వ్యాఖ్యలు చేసేస్తున్నారు. పార్టీలలో సీఎం రేసులో చాలా మంది ఉన్నారు. ఎన్నికల నేపథ్యంలో వివిధ పార్టీల నాయకులు దూకుడు పెంచారు. ఎవరికి వారు పదునైన వ్యాఖ్యలు చేసుకుంటూ జనాలను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా విజయదశమి పండగ సందర్భంగా సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. వచ్చే పదేళ్లకు ముఖ్యమంత్రి అవుతానని వ్యాఖ్యలు చేశారు.
సంగారెడ్డిలోని అంబేద్కర్ మైదానంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న జగ్గారెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. ఇప్పటి వరకు సంగారెడ్డి ప్రజలను తనను కడుపులో పెట్టుకుని కాపాడారని, ప్రజల ఆశీర్వాదంతోనే ఈ స్థాయికి వచ్చానని అన్నారు.
దసరా పండగ రోజు తన మనసులో ఉన్న మాటలను మీ ముందుంచుతున్నానని అన్నారు. ప్రజలు ఆశీర్వదిస్తే పదేళ్లకు అయినా తెలంగాణకు ముఖ్యమంత్రి అవుతానని అన్నారు. అయితే జగ్గారెడ్డి ఫోన్‌లో కూడా అందుబాటలో ఉండడని ఇటీవల వచ్చిన ఆరోపణలపై సమాధానం చెబుతానని అన్నారు.తాను ఫోన్‌లో అందుబాటులో లేకున్నా నా భార్య, అనుచరులు ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటారని అన్నారు. రామాయణంలో శ్రీరామచంద్రులకే నిందలు తప్పలేదు.. నేనెంతా అంటూ అన్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో తెలంగాణ కాంగ్రెస్‌లో జోష్ కనిపిస్తోందని రాష్ట్రంలో బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం కాంగ్రెస్సేనని భావించిన వివిధ పార్టీల నేతలు కాంగ్రెస్‌లో చేరుతున్నారని అన్నారు.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ మెజార్టీ సీట్లను గెలిస్తే సీఎం అయ్యే ఛాన్స్ తనకు వస్తుందని జానారెడ్డి భావిస్తున్నారట. కాంగ్రెస్ పార్టీలో సీఎం అభ్యర్థుల మధ్య పోటీ ఎక్కువగా ఉంది. పార్టీ అధికారంలోకి వస్తే వివాదరహితుడిగా, అందరికి ఆమోదయోగ్యుడిగా అవకాశం వస్తుందని జానారెడ్డి అనుచరులు చెబుతున్నారు.