కాంగ్రెస్ కు ఓటేస్తే వేస్ట్.. బీజేపీకి ఓటేస్తే ఇక అంతే
కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిప్పులు చెరిగారు.
కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిప్పులు చెరిగారు. ఆయన మునుగోడు ప్రజా దీవెన సభలో మాట్లాడుతూ కృష్ణా జిలాలను ట్రిబ్యునల్ కు రిఫర్ చేయమంటే కేంద్ర ప్రభుత్వం చేయడంల ేదన్నారు. మునుగోడులో బీజేపీని ఓడించాలని ఆయన పిలుపునిచ్చారు. కాంగ్రెస్ కు ఓటేస్తే అది వేస్ట్ అని ఆయన అన్నారు. మోదీ పార్టీకి ఓటేస్తే బావి కాడ మీటర్లు పెట్టినట్లేనని కేసీఆర్ హెచ్చరించారు. తమ ప్రభుత్వం ఉంటేనే కేంద్ర ప్రభుత్వం తీసుకునే ప్రతి ప్రజా వ్యతిరేక నిర్ణయాన్ని వ్యతిరేకిస్తానని తెలిపారు. బీజేపీకి మునుగోడులో ఎప్పుడూ డిపాజిట్లు రాలేదని అని ఆయన అన్నారు. అయితే ప్రజాదీవెన సభలో మునుగోడు అభ్యర్థిని కేసీఆర్ ప్రకటించకుండానే ముగించారు. అలాగే ఎలాంటి వరాలు ప్రకటించలేదు. మరోసారి చుండూరులో సభకు వస్తానని ఆయన తెలిపారు.
ఉచిత పథకాలను రద్దు...
ఉచిత పథకాలను రద్దు చేయాలని బీజేపీ ఆలోచిస్తుందన్నారు. బీజేపీ వస్తే ఉచిత కరెంటు కూడా దూరమవుతుందని ఆయన అన్నారు. మీటర్లు పెట్టే బీజేపీ కావాలా? మీటర్లు బీజేపీ కావాలా? అని ఆయన ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ప్రధాని మోదీ ఎనిమిదేళ్ల పాలనలో ఏం జరగలేదన్నారు. బీజేపీ తనను గోకినా గోకపోయినా తాను మాత్రం గోకుతూనే ఉంటానని చెప్పారు. బావి కాడ మీటర్లు పెట్టమంటే తాను చచ్చినా పెట్టనని చెప్పానన్నారు. బెంగాల్ లో మమత సర్కార్ ను పడగొడుతున్నామని అంటున్నారని, నీ అహంకారమే నిన్ను పడగొడుతుందని ఆయన ఫైర్ అయ్యారు.
మునుగోడు ప్రజలు దీవించాలి...
దేశంలో కార్పొరేట్ వ్యవసాయం అమలు చేయడానికి మోదీ రెడీ ఉన్నారని తెలిపారు. ఆ కుట్రలను తిప్పి కొట్టాలని కేసీఆర్ పిలుపు నిచ్చారు. ప్రజల ఆస్తులన్నీ కేంద్ర ప్రభుత్వం అమ్మేస్తుందని ఆయన అన్నారు. కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా ఎంతో తేల్చాలని ఆయన కోరారు. మిషన్ భగీరధ పేరుతో ఫ్లోరైడ్ నీళ్లను అందిస్తున్నామని ఆయన తెలిపారు. మునుగోడులో గోల్‌మాల్ ఉప ఎన్నిక వచ్చిందన్నారు. మునుగోడులో ఉప ఎన్నిక రావాల్సిన అవసరం ఏముందని ఆయన ప్రశ్నించారు. మునుగోడు ప్రజలు టీఆర్ఎస్ అభ్యర్థిని దీవించాలని ఆయన కోరారు. టీఆర్ఎస్ కు మద్దతు ప్రకటించిన సీపీఐకి ఆయన ధన్యవాదాలు చెప్పారు. రానున్న కాలంలో సీపీఐ, సీపీఎంలతో కలసి ప్రయాణం చేస్తామని కూడా ఆయన చెప్పారు.