మోదీ ఇక కేసీఆర్ కు అపాయింట్ మెంట్ ఇస్తారా?
ప్రధాని నరేంద్ర మోదీ కార్యక్రమాలకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దూరంగా ఉన్నారు
ప్రధాని నరేంద్ర మోదీ కార్యక్రమాలకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దూరంగా ఉన్నారు. మోదా దాదాపు ఆరు గంటల పాటు హైదరాబాద్ లో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం ప్రధాని స్వాగత కార్యక్రమంలోనూ పాల్గొన లేదు. ఇక్రిశాట్ స్వర్ణోత్సవ కార్యక్రమంలోనూ, రామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాల్లోనూ కేసీఆర్ తో పాటు ఆయన మంత్రి వర్గ సభ్యులు ఎవరూ పాల్గొన లేదు. ఒక్క స్వాగత కార్యక్రమంలో మాత్రం మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ పాల్గొన్నారు.
మోదీ పర్యటనకు దూరం....
బీజేపీ ప్రభుత్వంపై కేసీఆర్ ఇటీవల కాలంలో విమర్శలు చేసిన నేపథ్యంలో ఆయన మోదీ పర్యటనకు దూరంగా ఉన్నారని తెలిసింది. అస్వస్థత కారణంగా కేసీఆర్ రాలేదని చెబుతున్నా మోదీ కార్యక్రమాల్లో పాల్గొంటే తప్పుడు సంకేతాలు ఇచ్చినట్లవుతుందని ఆయన భావించి దూరంగా ఉన్నట్లు చెబుతున్నారు. వచ్చే ఏడాది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇక ఎన్నికల వరకూ మోదీని కేసీఆర్ కలిసే అవకాశం లేదని చెబుతున్నారు.