నేడు తమిళనాడుకు కేసీఆర్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు తమిళనాడు వెళ్లనున్నారు. శ్రీరంగంలోని శ్రీరంగనాధ స్వామి దేవాలయాన్ని కేసీఆర్ దర్శిస్తారు.

Update: 2021-12-13 01:39 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు తమిళనాడు వెళ్లనున్నారు. శ్రీరంగంలోని శ్రీరంగనాధ స్వామి దేవాలయాన్ని కేసీఆర్ దర్శిస్తారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ఈరోజు రాత్రికి చెన్నైలోనే కేసీార్ బస చేయనున్నారు.

స్టాలిన్ తో....?
రేపు కేసీఆర్ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ను కలిసే అవకాశముంది. జాతీయ స్థాయి రాజకీయాలను చర్చించనున్నారు. ఇప్పటికే కాంగ్రెస్, బీజేపీలకు వ్యతిరేకంగా కూటమిని ఏర్పాటు చేయాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో కేసీఆర్ తమిళనాడు పర్యటన ఆధ్యాత్మిక పరంగానే కాదు రాజకీయపరంగా కూడా ప్రాధాన్యత సంతరించుకుంది.


Tags:    

Similar News