అమెరికాలో రేవంత్ బిజీజీ.. ఎంఓయూలు కుదుర్చుకుంటూ

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికాలో బిజీబిజీగా గడుపుతున్నారు.

Update: 2024-08-06 04:10 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికాలో బిజీబిజీగా గడుపుతున్నారు. రాష్ట్రంలో పెట్టుబడుల కోసం ఆయన శ్రమిస్తున్నారు. వరసగా ఎన్‌ఆర్ఐలు, పారిశ్రామికవేత్తలతో సమావేశమై రాష్ట్రంలో పెట్టుబడులకు గల అవకాశాలను వివరిస్తున్నారు. బ్రేక్‌ఫాస్ట్ సమావేశాలు, లంచ్ మీటింగ్ లతో ఆయన పెట్టుబడులు సాధించే లక్ష్యంగా పర్యటన సాగుతుంది. ఇప్పటికే కొన్ని ప్రముఖ కంపెనీలతో ఒప్పందం చేసుకున్న రేవంత్ రెడ్డి బృందం మరిన్ని పెట్టుబడులు సాధించే దిశగా ఆయన తన ప్రయత్నాలను ముమ్మరం చేశారు.

రాయితీలను వివరిస్తూ...
కాంగ్రెస్ ప్రభుత్వం పదేళ్ల తర్వాత అధికారంలోకి రావడంతో తాము తెలంగాణలో పెట్టుబడులు పెడితే ఏ ఏ రాయితీలు ఉంటాయో చెప్పనున్నారు. ఉపాధి కల్పనే లక్ష్యంగా పెట్టుబడులు ఉండాలని ఆయన పారిశ్రామికవేత్తలను కోరుతున్నారు. ఐటీ హబ్ గా హైదరాబాద్ మారడంతో పాటు స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటును కూడా పదే పదే ప్రస్తావిస్తున్నారు. ఇప్పటికే కాగ్నిజెంట్ కంపెనీ తన కంపెనీ విస్తరించేందుకు ముందుకు వచ్చింది. పది లక్షల చదరపు అడుగులో కాగ్నిజెంట్ సంస్థను హైదరాబాద్ లో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దీనివల్ల పదిహేను వేల మందికి ఉపాధి కలగనుంది. ఈరోజు కూడా పారిశ్రామిక వేత్తలతో సమావేశాలు జరగనున్నాయి. పలు కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకోనున్నారు.


Tags:    

Similar News