యాదగిరి గుట్టకు చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదగిరి గుట్టకు చేరుకున్నారు

Update: 2024-11-08 06:26 GMT

revanth reddy reached yadadri

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదగిరి గుట్టకు చేరుకున్నారు. ఆయనకు ఆలయ పూజారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఉదయం హెలికాప్టర్ లో కుటుంబ సభ్యులతో బయలుదేరిన రేవంత్ రెడ్డి కొద్దిసేపటి క్రితం యాదాద్రికిచేరుకున్నారు. యాదాద్రిలో లక్ష్మీనరసింహస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన పుట్టిన రోజు నాడు యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకునేందుకు ఆయన కుటుంబ సభ్యులతో కలసి వచ్చారు.

అధికారులతో సమీక్ష...
ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలి పుట్టిన రోజు వేడుకలను రేవంత్ రెడ్డి యాదాద్రిలో జరుపుకుంటున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంట మంత్రులతో పాటు అధికారులు కూడా ఉన్నారు.నల్లగొండ జిల్లాకు చెందిన మంత్రులందరూ యాదాద్రికి చేరుకుని ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికారు. తర్వాత యాదాద్రిలో ఆయన టెంపుల్ డెవలెప్‌మెంట్ అథారిటీ అధికారులతో సమావేశం కానున్నారు. దేవాదాయ శాఖ అధికారులతో రేవంత్ రెడ్డి సమీక్ష చేయనున్నారు. తర్వాత మధ్యాహ్నం నుంచి ఆయన సంగెం నుంచి మూసీ నదీ పరివాహక ప్రాంతంలో పాదయాత్ర చేపట్టనున్నారు.


Tags:    

Similar News