Tigger : నాకొక తోడు కావాలి.. అందుకే తిరుగుతున్నా
పులి తోడు కోసం పరితపిస్తుంది. తనకు తోడు కావాలంటూ తెగ తిరుగుతుంది
మనుషులకు తోడు అవసరం. తోడు లేకుంటే జీవితం దుర్లభం. మనుషులకు ఎలాగో జంతువులు కూడా తోడును కోరుకుంటాయి. తనకు తోడుగా మరో ఆడపులి ఉంటే బాగుంటుందని మగపులి కోరుకుటుంది. ఇలాంటి ఘటన ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లాలోని కవ్వాల్ అభయారణ్యంలో ఒక పులికి సంభవించింది. ఆ పులి తోడు కోసం పరితపిస్తుంది. తనకు తోడు కావాలంటూ తెగ తిరుగుతుంది. అభయారణ్యంలో తోడు కోసం పులి వెదుకులాడుతుందని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు.
నెల రోజుల నుంచి...
గత నెల రోజుల నుంచి ఈ పులి తోడు కోసం పరితపిస్తుంది. అడవి అంతా గాలిస్తుంది. దాదాపు 350 కిలోమీటర్ల దూరం ప్రయాణించి ఎక్కడైనా తనకు తోడు లభిస్తుందేమోనని పరితపించి పోతుంది. మహారాష్ట్ర అడవుల నుంచి కొండలు, గుట్టలు దాటి జాతీయ రహదారుల మీదుగా ప్రయాణించి కవ్వాల్ అడవుల్లో సంకరించుకుంది. ప్రస్తుతం జోడే ఘట్ లో ఆ పులి అనుకున్నది సాధించింది. అక్కడ ఒక ఆడపులి జాడను పసిగట్టి ఆ వైపుగా ప్రయాణం చేస్తుంది.
జోడేఘట్ ప్రాంతంలో...
ఆడపులి ఈ ప్రాంతంలో సంచరిస్తున్నట్లు పసిగట్టిన మగపులి దాని కోసం వెదుకుతూనే ఉంది. దాని వెదుకులాట ఇంకా పూర్తి కాలేదు. ఆడపులి జాడ లభించలేదు. అయినా సరే విరామం ఎరగకుండా మగపులి ఆడపులి కోసం అన్వేషణ కొనసాగుతూనే ఉంది. ఆడపులి జాడ లభ్యమయితే కాని మగపులికి విశ్రాంతి తీసుకునే అవకాశం లేదనిపిస్తుంది. ఇటీవల మహారాష్ట్ర లోని అటీవీ ప్రాంతం నుంచి అనేక పులులు కవ్వాల్ అభయారణ్యానికి వచ్చాయని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. ఆడపులి కోసం సంచరిస్తున్న ఈ మగపులి అన్వేషణను కెమెరాల్లో అటవీ శాఖ అధికారులు బంధించారు. జంతువులకు కూడా తోడు ఎంత అవసరమో ఈ ఉదంతం తెలియచేస్తుంది.