Revanth Reddy : రేవంత్ రెడ్డి నేడు అమెరికాలో షెడ్యూల్ ఇదే

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన కొనసాగుతుంది.

Update: 2024-08-09 02:57 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన కొనసాగుతుంది. ఆయన పలువురు పారిశ్రామికవేత్తలు, వివిధ సంస్థల ప్రతినిధులతో వరస సమావేశాలు జరుపుతూ రాష్ట్రంలో పెట్టుబడుల కోసం ప్రయత్నిస్తున్నారు. ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు. ఈరోజు రేవంత్ రెడ్డి గూగుల్ ప్రతినిధులతో భేటీ కానున్నారు. తెలంగాణలో గూగుల్ పెట్టుబడులకు సంబంధించి ఆ సంస్థ ప్రతినిధులతో చర్చించనున్నారు. తర్వాత స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలోని బయోడిజైన్ సెంటర్ కు వెళతారు. అక్కడ వారితో చర్చిస్తారు.

వరస సమావేశాలతో...
తెలంగాణలో పెట్టుబడులు పెడితే మౌలిక సదుపాయాలతో పాటు అనేక రాయితీలను ప్రకటిస్తామని రేవంత్ రెడ్డి వారికి హామీ ఇస్తూ వెళుతున్నారు. గూగుల్ ప్రతినిధులతో సమావేశం అనంతరం అమెజాన్ గ్లోబల్ డేటా సెంటర్ ప్లానింగ్ వైస్‌ ప్రెసిడెంట్ తో రేవంత్ రెడ్డి సమావేశమవుతారు. ఆ తర్వాత జడ్ స్కాలర్ జై చౌదరిని, కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈవోను కలుస్తారు. తర్వాత ఎన్‌ఆర్ఐలతో ఆత్మీయ సమ్మేళనంలో రేవంత్ రెడ్డి పాల్గొంటారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని ఆయన అమెరికా పర్యటన సాగుతుంది. రేవంత్ రెడ్డి వెంట మంత్రులు శ్రీధర్ బాబుతో పాటు అధికారులు కూడా ఉన్నారు.


Tags:    

Similar News