తెలంగాణ నిర్మాణాలకు 5 అంతర్జాతీయ పురస్కారాలు
లండన్ కు చెందిన గ్రీన్ ఆర్గనైజేషన్ ప్రకటించిన ఈ అవార్డుల్లో.. యాదాద్రి ఆలయం సహా 5 నిర్మాణాలకు ఇంటర్నేషనల్ బ్యూటిఫుల్..
తెలంగాణలో అభివృద్ధి ఏ స్థాయిలో జరుగుతుందో.. అక్కడి ప్రభుత్వం చేపడుతున్న నిర్మాణాలను చూస్తే అర్థమవుతుంది. దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జి, యాదాద్రి ఆలయం, ఇటీవలే ప్రారంభమైన నూతన సచివాలయం, అంబేద్కర్ స్టాచ్యూ.. ఇలా కళ్లకు అందంగా కనిపించే నిర్మాణాలను చేపట్టింది. తాజాగా తెలంగాణలోని ఐదు నిర్మాణాలకు అంతర్జాతీయ అవార్డులు లభించాయి.
లండన్ కు చెందిన గ్రీన్ ఆర్గనైజేషన్ ప్రకటించిన ఈ అవార్డుల్లో.. యాదాద్రి ఆలయం సహా 5 నిర్మాణాలకు ఇంటర్నేషనల్ బ్యూటిఫుల్ బిల్డింగ్స్ గ్రీన్ యాపిల్ అవార్డులు వచ్చాయి. యాదాద్రి ఆలయం, దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి, తెలంగాణ సచివాలయం, పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్, మొజాంజాహీ మార్కెట్ నిర్మాణాలకు గ్రీన్ యాపిల్ అవార్డులు దక్కాయి. జూన్ 16న లండన్ లో గ్రీన్ ఆర్గనైజేషన్ సంస్థ ఈ అవార్డులను అందించనుండగా.. రాష్ట్ర ప్రభుత్వం తరపున పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్ అవార్డులను అందుకోనున్నారు.