Kodandaram : కాంగ్రెస్ కు కోదండరామ్ మద్దతు.. కండిషన్లు ఇవే
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ కు బేషరతుగా మద్దతిచ్చేందుకు తెలంగాణ జన సమితి నేత కోదండరామ్ అంగీకరించారు
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ కు బేషరతుగా మద్దతిచ్చేందుకు తెలంగాణ జన సమితి నేత కోదండరామ్ అంగీకరించారు. పార్టీ వ్యవహరాల ఇన్ ఛార్జి మాణిక్ రావు ఠాక్రే, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిలు ఆయన ఇంటికి వెళ్లి మద్దతు ఇవ్వాలని కోరారు. మొత్తం ఆరు అంశాలతో తాము మద్దతివ్వాలని నిర్ణయించినట్లు కోదండరామ్ ఆ తర్వాత మీడియాకు తెలిపారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగాలను భర్తీ చేయాలని, ఉపాధి అవకాశాలను మెరుగుపర్చాలని కోదండరామ్ కోరారు.
అందరం కలసి...
పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ జన సమితి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటుందని చెప్పారు. బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా అందరం కలసి ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నామని చెప్పారు. గడీల పాలన పోవాలని, ప్రజాస్వామ్యం రావాలని కోదండరామ్ కూడా కోరుకున్నట్లు ఆయన తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించిన కోదండరామ్ ఈ ఎన్నికల్లో తమ పార్టీకి మద్దతు ఇస్తామని ప్రకటించడం శుభపరిణామమని ఆయన తెలిపారు. బీఆర్ఎస్ అనైతిక చర్యలకు పాల్పడితే ప్రజలే బండకేసి తిప్పి కొడతారని రేవంత్ అన్నారు