కేంద్రానికి కేటీఆర్ ఘాటు లేఖ
పెట్రోలు ధరల పెంపుదల పై కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ మంత్రి కేటీఆర్ లేఖ రాశారు.
పెట్రోలు ధరల పెంపుదల పై కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ మంత్రి కేటీఆర్ లేఖ రాశారు. వరసగా పెట్రోలు ధరలను పెంచుతూ సామాన్యుడిపై భారం మోపుతున్నారన్నారు. సబ్ కా సాథ్ సబ్ కా వికాస్కాదని సబ్ కా సత్తేనాశ్ అని ఆయన లేఖలో తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గినప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం పెట్రోలు ధరలను తగ్గించలేదన్న విషయాన్ని ఆయన లేఖలో గుర్తు చేశారు.
పెట్రోలు ధరల పెంపుదలపై.....
భారతీయ జనతా పార్టీ అవలంబిస్తున్న అసమర్థ విధానాలే ఈ దుస్థితికి కారణమని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. ప్రజల బాధలు బీజేపీకి పట్టవని, ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా పనిచేస్తుందని చెప్పారు. 26 కోట్ల కుటుంబాల నుంచి 26.51 లక్షల కోట్ల రూపాయలు పెట్రోలు పన్నుల రూపంలో ఈ ప్రభుత్వం దోచుకుందని చెప్పారు. ఈ దోపిడీ కూడా దేశం కోసం, ధర్మం కోసమేనా? అని కేటీఆర్ ప్రశ్నించారు. పెట్రోలు ధరల పెంపుదలను ఆపకపోతే ప్రజలు తిరస్కరిస్తారని కేటీఆర్ అన్నారు.