తెలంగాణలో బదిలీ అయిన ఐపీఎస్ అధికారులు వీరే!!

తెలంగాణలో 15 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ

Update: 2024-07-10 14:54 GMT

తెలంగాణలో 15 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తెలంగాణ నూతన డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి జితేందర్ ను నియమించినట్లు ప్రకటించిన కొన్ని గంటలకే ఈ బదిలీల ప్రకటన వచ్చింది. శాంతి భద్రతల అదనపు డీజీపీగా మహేశ్ భగవత్, హోంగార్డులు, ఆర్గనైజేషన్ అదనపు డీజీగా స్వాతి లక్రాలను నియమించారు. రాచకొండ పోలీస్ కమిషనర్‌గా సుధీర్ బాబు, ఏసీబీ డైరెక్టర్‌గా తరుణ్ జోషి, మల్టీజోన్-1 ఐజీగా చంద్రశేఖర్ రెడ్డి, మల్టీజోన్-2 ఐజీగా సత్యనారాయణ, రైల్వే, రోడ్ సేఫ్టీ ఐజీగా రమేశ్ నాయుడు, మెదక్ ఎస్పీగా ఉదయ్ కుమార్ రెడ్డి, వనపర్తి ఎస్పీగా ఆర్ గిరిధర్ లను నియమించారు. సీఏఆర్ హెడ్ క్వార్టర్స్ డీసీపీగా రక్షితమూర్తిని నియమించారు.

గ్రేహౌండ్స్ ఏడీజీగా స్టీఫెన్ రవీంద్ర, పోలీస్ పర్సనల్ అడిషనల్ డీజీగా విజయ్ కుమార్, టీజీఎస్పీ బెటాలియన్ల అదనపు డీజీగా సంజయ్ కుమార్‌ను నియమించినట్లు తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. హైదరాబాద్ ఈస్ట్ జోన్ డీసీపీగా బాలస్వామి, హైదరాబాద్ వెస్ట్ జోన్ డీసీపీగా చంద్రమోహన్ కు బాధ్యతలను అప్పగించారు.
తెలంగాణ నూతన డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి జితేందర్ నియమితులయ్యారు. బుధవారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఆయన హోంశాఖ ముఖ్యకార్యదర్శిగా ఆయన ఉన్నారు. గతంలో విజిలెన్స్ అండ్ ఇన్ఫోర్స్మెంట్ డీజీగా ఆదనపు బాధ్యతలు కూడా నిర్వర్తిస్తున్నారు. తెలంగాణలోని నిర్మల్, బెల్లంపల్లి ఏఎస్పీగా తొలుత విధులు నిర్వర్తించారు.


Tags:    

Similar News