పడిపోతున్న ఉష్ణోగ్రతలు

తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

Update: 2022-11-27 02:54 GMT

తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సింగిల్ డిజిట్ తో ఉష్ణోగ్రత నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తుంది. కొమురం భీం జిల్లాలో 9.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోయింది. దీంతో ప్రజలు చలితో వణికిపోతున్నారు. నిర్మల్ జిల్లాలోనూ 12 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని అధికారులు తెలిపారు.

పెరిగిన చలిగాలులు...
ఆంధ్రప్రదేశ్ లోనూ ఏజెన్సీ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో 13 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అరకులోయలో 12, మినుములూరులో 11 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక ఉదయం పది గంటల వరకూ బయటకు రావడానికి ప్రజలు జంకుతున్నారు. మరో వైపు చలిగాలులు బలంగా వీస్తున్నాయి. ఈ వాతావరణంతో పలు శ్వాసకోస వ్యాధులు వచ్చే అవకాశముందని వైద్యులు చెబుతున్నారు.


Tags:    

Similar News